అన్ని దేశాలకు రాజ్యాంగం ఉన్నప్పటికీ భారత రాజ్యాంగంలో అంబేద్కర్ ఆత్మ ఉందని జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ కొనియాడారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణంలో బాగంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు నల్ల శ్యామ్, అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘము రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దెల నారాయణ పాల్గొన్నారు.