జగిత్యాల మున్సిపల్ పరిధిలోని తారకరామ నగర్ సమీపంలో గల ఇటుక బట్టిలలో పనిచేసే వారి గృహాలను జగిత్యాల ప్రాజెక్టు సీడీపీఓ మమత గురువారం సందర్శించారు. అక్కడ తాత్కాలికంగా నివాసం ఉంటున్న లబ్ధిదారులైన ఏడవ నెల నుండి మూడు సంవత్సరాల లోపు పిల్లలకు బాలామృతం, ఎగ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్ లావణ్య, అంగన్వాడీ టీచర్ రజిత, తల్లులు, పిల్లలు పాల్గొన్నారు.