జగిత్యాల జిల్లాలో సైబర్ జాగృక్త దివస్

81చూసినవారు
జగిత్యాల జిల్లాలో సైబర్ జాగృక్త దివస్
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించడం కోసం ప్రతి నెల మొదటి బుధవారం రోజున సైబర్ జాగృక్త దివస్ అనే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకు, యువతకు, ప్రజలకు సైబర్ భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా పోలీసు స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్