జిల్లాలో శిశు మరణాల రేటును తగ్గించుటకు వైద్యులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో మినీ కాన్ఫరెన్స్ హల్ లో చైల్డ్ డెత్ రివ్యూ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇప్పటివరకు జరిగిన 78 మరణాలలో 14 మంది చిన్నపిల్లల మరణాలపై డెత్ ఆడిట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ డెత్ రివ్యూ కమిటీ మెంబర్స్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.