పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారి సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లుతానని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిసి పుష్పగుచ్ఛం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తమ సమస్యలను విన్నవించారు.