జగిత్యాల: విద్యుత్ మోటారు చోరీ

53చూసినవారు
జగిత్యాల: విద్యుత్ మోటారు చోరీ
జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట గ్రామ శివారులో గల గచ్చు మాటు వాగు వద్ద గల బోగు సత్తయ్య అనే రైతుకు చెందిన వ్యవసాయ విద్యుత్ మోటార్ గుర్తు తెలియని దొంగలు శనివారం తెల్లవారుజామున ఎత్తుకెళ్లారు. ఈ సంఘటనపై బాధిత రైతు జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గతంలో కూడా పలువురు రైతులకు చెందిన విద్యుత్ మోటార్లు చోరీకి గురైనట్లు రైతులు తెలిపారు.

సంబంధిత పోస్ట్