జగిత్యాల జిల్లా మహిళా శిశు దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయ పరిశోధన, శిక్షణ కేంద్రం టీచర్స్ భవన్లో లూయిస్ బ్రెయిలీ 216వ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నర్వహించారు. ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ దివ్యాంగులతో కలిసి కేక్ కట్ చేసి, 2025 బ్రెయిలీ క్యాలండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిడబ్ల్యూఓ డా. నరేష్, ఈఈ ఖాన్, డిఈ వాజిద్, సీడీపీవో మమత పాల్గొన్నారు.