తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం నుంచి జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ కు మంగళవారం నోటీసులు అందినట్టు సమాచారం. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ న్యాయ నిపుణులను సంప్రదించి నిర్ణయం చెపుతాం అన్నట్టు తెలిసింది. ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ బిఆర్ఎస్ పార్టీ నుండి రెండవ సారి గెలుపొందారు. గత సంవత్సరం జులై నెలలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.