జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో టిఎస్ ఆర్టిసి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సభ్యులు శనివారం ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ను కలిసి తమ సంఘానికి స్థలం కేటాయించాలని వినత్రి పత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే సంఘం డైరీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కంటాల రవీందర్, కార్యదర్శి కస్తూరి సత్తయ్య, ఆర్థిక కార్యదర్శి కంది రాజేశం, రాష్ట్ర కార్యదర్శులు కస్తూరి సుధాకర్, పొట్లపల్లి సురేందర్రావు పాల్గొన్నారు.