జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ను ఎమ్మెల్యే క్వార్టర్స్ లో జగిత్యాల డబల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులు ఆదివారం కలిశారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్లలో త్రాగు నీటి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యేను కోరారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే అతిత్వరలో తాగు నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.