జగిత్యాల: ఆర్టీసీ డిపో మేనేజర్ ను అభినందించిన సజ్జనార్

80చూసినవారు
జగిత్యాల: ఆర్టీసీ డిపో మేనేజర్ ను అభినందించిన సజ్జనార్
జగిత్యాల కొత్త బస్టాండ్ లో మహిళా ప్రయాణికురాలికి ఇటీవల ఆరోగ్యం క్షీణించడంతో అక్కడే ఉన్న డిపో మేనేజర్ సునీత ఆమెకు సత్వరం సీపీఆర్ చేసి ఆసుపత్రికి పంపించారు. ఆమె సేవలకు గాను ఆర్టీసి సంస్థ ఎండి సజ్జనార్ హైదారాబాద్ బస్ భవన్ లో బుధవారం అభినందనలు తెలియజేస్తూ సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్టీసి డిపో ఉద్యోగులు కవిత, శ్రీనివాస్, ఆఫీస్ సిబ్బంది బి ఆర్ రావు తదితరులు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్