జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ కొండ రఘుపతి గురువారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ చేతుల మీదుగా జగిత్యాలలో సేవా పథకాన్ని అందుకున్నారు. జిల్లా పోలీస్ విభాగంలో సాంకేతిక విధానాలను అమలుపర్చి మంచి
ఫలితాలు తీసుకు వచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నేడు రఘుపతి సేవా పథకం పొందడానికి ఎన్నికయ్యారు. రఘుపతికి మెట్ పల్లి పట్టణానికి చెందిన పలువురు అభినందనలు తెలిపారు.