కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు 15 నామినేషన్లు

59చూసినవారు
కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు 15 నామినేషన్లు
పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి గురువారం 15 నామినేషన్లు కరీంనగర్ లో దాఖలయ్యాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి 12 మంది నామినేషన్ వేయగా, టీచర్స్ ఎమ్మెల్సీకి ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థుల నుంచి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి నామినేషన్లు స్వీకరించారు. ఇప్పటివరకు పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు కలిపి మొత్తం 28 మంది నామినేషన్లు దాఖలయ్యాయి.

సంబంధిత పోస్ట్