78వ స్వాతంత్య్ర దినోత్సవం రోజున కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగి బిల్ కలెక్టర్ సుంకె రామకృష్ణ 34వ సారి రక్తదానం చేయడం జరిగింది. కరీంనగర్ అభయ హాస్పిటల్ లో వెంకటయ్య అనే వ్యక్తి కిడ్నీ సమస్యతో ఆరోగ్యం క్షీణించడంతో సీరియస్ గా ఉన్నాడు అని, అత్యవసరంగా రక్తం కావాలి అని తెలపగానే వెంటనే స్పందించి బిల్ కలెక్టర్ రామకృష్ణ రక్తదానం చేశారు. ఎవరికి అయిన రక్తం అవసరం ఉంటే 8897943398 ఈ నెంబర్ కి కాల్ చేయండి అన్నారు.