తెలంగాణ సంగీత నాటక అకాడమీ, భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కరీంనగర్ కళాభారతిలో నిర్వహిస్తున్న పౌరాణిక పద్య నాటక కార్యక్రమం ముగిసింది. గురువారం మన సమైక్యత కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో కళాకారులు సాయిబాబా జీవిత చరిత్ర నాటకం ప్రదర్శించారు. నాటకాన్ని తిలకించేందుకు నాటక కళాభిమానులు, సాయి భక్తులు తరలివచ్చారు. సాయిబాబా జీవిత చరిత్రను అంతరించి పోతున్న నాటకాల రూపంలో వీక్షించి నూతన అనుభూతి చెందారు.