కరీంనగర్: శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తప్పవు: సీపీ

76చూసినవారు
కరీంనగర్: శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తప్పవు: సీపీ
కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి గురువారం తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ చర్యల దృష్ట్యా నియమ నిబంధనలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. సంబంధిత ఏసీపీల నుంచి అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ఊరేగింపులను నిర్వహించకూడదని తెలిపారు. అనుమతులు లేకుండా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్