కరీంనగర్ మండలంలో పలు అంగన్వాడి కేంద్రాలలో తల్లి పాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని తల్లులు బిడ్డలకు 6 నెలల పాటు తల్లిపాలు సాగించాలని, 6 నెలల తర్వాత తల్లిపాలతో పాటు అదనపు ఆహారం పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు ఆశా వర్కర్లు అనిత, అంగన్వాడి టీచర్లు పద్మశ్రీ, రాజేశ్వరి, గ్రామ పెద్దలు, తల్లులు పాల్గొన్నారు.