కరీంనగర్ నగరపాలక సంస్థలో మంకమ్మతోట దన్గర్ వాడి పాఠశాలలో రఘువర్ధన్ అనే విద్యార్థి కోతులను చూసి భయపడి కింద పడి తీవ్ర గాయాలైన ఘటనపై మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ శనివారం స్పందించారు. బాలుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కోతుల బెడద ఉన్న పాఠశాలలకు కొండ ముచ్చుల ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కోతుల బెడద ఎక్కువగా ఉన్న కాలనీలలో కోతులను పట్టి అడవిలో వదిలిపెట్టేందుకు టెండర్లు పిలుస్తామన్నారు.