కరీంనగర్: శ్రీ మహాశక్తి దేవాలయంలో భక్తుల సందడి

63చూసినవారు
కరీంనగర్లోని మహాశక్తి దేవాలయంలో వైభవంగా సంకటహర చతుర్థి వేడుకలు శుక్రవారం రాత్రి నిర్వహించారు. శ్రీ లక్ష్మీగణపతి స్వామివారికి అభిషేకం చేశారు. గరిక మలాలతో, పలు రకాల పువ్వులతో విశేషంగా అలంకరించారు. గణపతి భజనలతో ఆలయ ప్రాంగణం కోలాహలంగా మారింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో తరలిరాగా సందడి నెలకొంది.

సంబంధిత పోస్ట్