ఇకపై ఫోన్ పే, భీమ్ యాప్లలో చెల్లించవచ్చని కరీంనగర్ విద్యుత్ సంస్థ ఎస్ఈ గంగాధర్ తెలిపారు. ఈ విషయంపై భారత్ బిల్లు పేమెంట్ సిస్టం సర్వీస్లో ఒప్పందం జరిగిందని పేర్కొన్నారు. వచ్చే వారం నుంచి గూగుల్ పేలో కూడా అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.