బధిరుల విద్యార్థులను అభినందించిన కరీంనగర్ కలెక్టర్

84చూసినవారు
బధిరుల విద్యార్థులను అభినందించిన కరీంనగర్ కలెక్టర్
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెల మొదటి రౌండ్ టేబుల్ ఇండియా స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయస్థాయి బధిరుల ఆటల పోటీల్లో ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. వివిధ పోటీల్లో 15 మంది బాలికలు, 22 మంది బాలురు పాల్గొని ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచి 12 బహుమతులు సాధించారు. ఈ సందర్భంగా వారిని మంగళవారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయిలు అభినందించారు.

సంబంధిత పోస్ట్