కరీంనగర్ కళాభారతిలో అమ్ము స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ముగ్గుల పోటీల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ సునీల్ రావు అమ్ము స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ సుజాత రెడ్డి పాల్గొని విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. మొదటి బహుమతి సెల్కార్ కంపెనీ రిఫ్రిజిరేటర్ ఇందుకు, రెండో బహుమతి టీవీని విజయలక్ష్మి, మూడో బహుమతి మిక్సీ అన్వితకు అందజేశారు.