కొత్తపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన: సీపీ

73చూసినవారు
కొత్తపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన: సీపీ
కొత్తపల్లి పోలీస్ స్టేషన్ ను కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి బుధవారం తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లో గల పెండింగ్ కేసులపై సమీక్షించి, వాటికి గల కారణాలు తెలుసుకున్నారు. త్వరితగతిన వాటిని పూర్తి చేయాలని సూచించారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్