స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు అమలుపరిచిన తర్వాతనే స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ శనివారం డిమాండ్ చేశారు. కుల గణనలో బీసీ జనాభా లెక్కలలో జరిగిన తప్పులను సరి చేయడం కోసం తిరిగి సర్వే నిర్వహించాలని బిఆర్ఎస్ ప్రతినిధుల బృందం ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి వినతి పత్రం సమర్పించారు.