కరీంనగర్ నగరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ప్రకాశంగంజ్ లోని వరసిద్ధి వినాయక ఆలయం నుంచి మార్కెట్ రోడ్ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు సారే సమర్పించేందుకు గురువారం శోభయాత్రగా వెళ్లి సమర్పించారు. పద్మశాలీ సంఘం తరుపున సారే సమర్పించడం సంతోషంగా భావిస్తున్నామని సంఘం నాయకులు అన్నారు. నలుమూలల నుంచి పద్మశాలీలు తరలివచ్చారని వారు తెలిపారు.