గత నెల 25న కరీంనగర్ లోని అశోక్ నగర్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. బంగారి నరేశ్ కుమార్, ఎండి ఆసిఫ్ పాషా అలియాస్ అయాన్ అనే ఇద్దరిని అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్కు తరలించినట్లు సీఐ కోటేశ్వర్ తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ. 1. 25 లక్ష నగదు, బంగారు వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.