కరీంనగర్: స్థానిక పోరుకు సన్నద్ధం

83చూసినవారు
కరీంనగర్: స్థానిక పోరుకు సన్నద్ధం
కరీంనగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా పంచాయతీ ఎన్నికలా? ప్రాదేశిక ఎన్నికలా? అనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. కాగా ఇప్పటికే ఎన్నికల కమిషన్ నుంచి ఎన్నికల సామగ్రిని జిల్లాలకు పంపించే ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా ఏ ఎన్నికలు ముందుగా వస్తాయనే విషయంపై గ్రామాల్లో ఆదివారం చర్చ జోరుగా జరుగుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్