మండలంలోని పెంచికల్ పేట్ గ్రామంలో గల రెండు వాగులపై నాలుగు చెక్ డ్యాముల నిర్మాణాలకు సంబంధించి ఇరిగేషన్ అధికారులు బుధవారం సర్వే నిర్వహించారు. కాగా, ఇటీవల సింగరేణి ఆర్ జీ -2 జీఎం బండి వెంకటయ్యకు సింగరేణి ప్రభావిత గ్రామమైన పెంచికల్ పేట్ వాగుల పై చెక్ డ్యాములు నిర్మించి రైతులకు సాగునీటి ఇక్కట్లు దూరం చేయాలని పల్లె నారాయణ వినతి పత్రాన్ని అందజేశారు.