జగిత్యాల జిల్లాలో యాదవులను చైతన్య పరచడమే ధ్యేయంగా ముందుకు సాగుదామని యాదవ సంఘం అడహాక్ కమిటీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్ ఆదివారం అన్నారు. కోరుట్ల మండలంలోని కిషన్ రావ్ పేట గ్రామంలో యాదవ సంఘ సమావేశాన్ని నిర్వహించి యాదవుల ఐక్యత, సభ్యత్వాలు, సంఘ బలోపేతం, యాదవ హక్కుల సాధన సమస్యల పరిష్కారం తదితర విషయాలు చర్చించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం అడహాక్ కమిటీ ఇన్‌చార్జ్ లు పాల్గొన్నారు.