కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పడిపోతున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు జిల్లా పరిధిలోని వివిధ మండలాలు, పల్లెలు చలి తీవ్రతకు గజగజలాడుతున్నాయి. నగరంలో అత్యంత బిజీగా ఉండే గీతా భవన్ చౌరస్తా వద్ద చలి తీవ్రతతో ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో సైతం స్వల్ప వాహన రద్దీతో బోసిపోయి కనిపించింది.