మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి రేపటి పర్యటన

72చూసినవారు
మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి రేపటి పర్యటన
మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నియోజకవర్గంలో రేపటి పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం గన్నేరువరం మండలం గుండ్లపల్లిలోని రైతు వేదికలో సేవ యువత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే రక్తదాన శిబిరంలో కలెక్టర్ పమేలా సత్పతితో సంయుక్తంగా హాజరుకానున్నారు. తిమ్మాపూర్ మండలం మహాత్మనగర్ లోని తాపాల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరిగే స్వామివారి కళ్యాణ మహోత్సవానికి హాజరవుతారు. అనంతరం పలు శుభకార్యాలలో పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్