శంకరపట్నం మండలం గుడాటిపల్లెలో శుక్రవారం సాయంత్రం హనుమాన్ శోభాయాత్ర ఘనంగా జరిగింది. ఈ శోభాయాత్రలో హనుమాన్ మాలాదారులు శ్రీరామ, లక్ష్మణ, హనుమాన్ వేషధారణలతో గ్రామంలో వాడ వాడ తిరిగారు. శోభాయాత్రలో మహిళలు ప్రతి ఇంటి నుంచి మంగళ హారతులతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతవరణం నెలకొంది.