ఇల్లంతకుంట మండల కేంద్రంలోని 132 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ లో అంతర్గత పనులు మరమ్మత్తులు చేపట్టనున్న నేపథ్యంలో శనివారం ఉదయం 11: 00 గంటల నుండి సాయంత్రం 4: 00 గంటల వరకు విద్యుత్తు అంతరాయం ఉంటుందని ఇల్లంతకుంట సెస్ ఏఈ నగేష్ శు క్రవారం ప్రకటనలో తెలిపారు. ఇల్లంతకుంట, సోమవారంపేట, అనంతగిరి, పెద్దలింగాపురం, చీర్లవంచ, రాంచంద్రపూర్, రహీంకణపేట, కందికట్కూర్ గ్రామాల విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.