భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మానకొండూర్ మండల వ్యాప్తంగా శుక్రవారం జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సావిత్రి పూలే చిత్రపటానికి టీచర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు విద్యా బోధన చేస్తున్న పలువురు మహిళా టీచర్లను ఘనంగా సన్మానించారు.