తిమ్మాపూర్ మండలం మక్తపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య మహిళ క్యాంపును గురువారం కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. గ్రామ సంఘాల సభ్యులు ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. క్యాంపు నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించి రిజిస్టర్ను తనిఖీ చేశారు. 45 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా ఈ కార్యక్రమంలో నిర్వహిస్తున్నామన్నారు.