పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన స్కీమ్స్, ఉద్యోగ ప్రకటనలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని జిల్లా వెబ్ సైట్ లో పొందుపరచాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులకు సూచించారు. బుధవారం పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, వేణుతో కలిసి కలెక్టర్ పాల్గొని జిల్లా అధికారులు అందించే సమాచారాన్ని ప్రతి సోమవారం వెబ్ సైట్ లో అప్డేట్ చేయడం జరుగుతుందన్నారు.