పాఠశాలలో మౌలిక వసతుల కల్పన: కలెక్టర్

61చూసినవారు
పాఠశాలలో మౌలిక వసతుల కల్పన: కలెక్టర్
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మౌలిక వసతుల కల్పనకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం మంథని మండలం ఖాన్ సాయి పేట, ఆరెంద, అడవి సోమన్ పల్లి ప్రభుత్వ పాఠశాలలతో పాటు వెంకటాపూర్ లోని జ్యోతిబాపూలే పాఠశాలను తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట మంథని ఎంపీడీవో పూర్ణచందర్ రావు, ఎమ్మార్వో రాజయ్య, పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ ఇంజనీర్ నవీన్, అసిస్టెంట్ ఇంజనీర్ అనుదీప్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్