జిల్లాలో ముందస్తు సాగుకు రైతులు సన్నద్ధమవ్వాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ వానాకాలం సాగు జూన్ నుండి అక్టోబర్ వరకు 5 నెలల వ్యవధి ఉంటుందని, వానాకాలం పూర్తిగా వర్షధారమైందన్నారు. ముందస్తు పంటల సాగుకు సిద్ధం కావాలని, వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలన్నారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి పంట నష్టాలను తప్పించాలని, ఆ దిశగా ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.