పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలో ఉత్తర ముఖ ద్వారంతో సీతారామ స్వామి, గోపాలస్వామి ఆలయం ఉంది. సుమారు 400 ఏళ్ల కాలం నాటి నుంచి భజన కార్యక్రమలు, ధూప దీప నైవేద్యాలతో పాటు నిత్యం పూజలు చేయడం జరుగుతుందని ఆలయ పూజారి రామన్న పేర్కొన్నారు. ఈ ఆలయంలో శ్రీ రామనవమికి స్వామి వారి కళ్యాణం, రథోత్సవం, విజయదశమికి శ్రీవారిని అశ్వవాహనంపై ఊరేగిస్తామని, దత్త జయంతిని ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.