కమాన్ పూర్: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలి

52చూసినవారు
కమాన్ పూర్: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలి
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య అన్నారు. మంగళవారం కమాన్ పూర్ మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇంటి పన్నుల వసూలు 100శాతం పూర్తి చేయాలన్నారు. అలాగే ప్రతి గ్రామంలో మురికి కాలువలు శుభ్రంగా ఉండాలని, తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్ పీఓ సతీష్, ఎంపీడీవో లలిత, ఎంపీవో బాస్కర్, ఎంపీవో ఉమేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్