తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్య స్నానాలు ఆచరించారు. మంథని గోదావరి నది తీరంలో తెల్లవారు జాము నుండే భక్తులు చేరుకుని స్నానాలు చేసి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం సమీపంలో ఉన్న గౌతమేశ్వర ఆలయంలో శివ లింగాన్ని దర్శించి మొక్కలు తీర్చుకున్నారు.