మలేషియా కరాటే పోటీలలో బంగారు పతకం సాధించిన మెట్టు హాసినిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. శనివారం మంథని పట్టణం మంత్రి క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు గోటికారి కిషన్ జి ఆధ్వర్యంలో ఇటీవలే బంగారు పతకం సాధించిన మెట్టు హాసిని, శిక్షకులు కావేటి సమ్మయ్యలను ఘనంగా శాలువాతో సన్మానించి సత్కరించారు.