మంథని: సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేసిన మంత్రి దుద్దిళ్ల

3చూసినవారు
మంథని: సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేసిన మంత్రి దుద్దిళ్ల
ప్రభుత్వం అందించే సబ్సిడీ విత్తనాలను శనివారం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం అనే కార్యక్రమం లో భాగంగా వరి, కందులు, పెసర్లు, మినుములు మొదలైన రెండు లక్షల సబ్సిడి విత్తనాలను పంపిణీ చేశారు. మంథని డివిజన్ లోని నాలుగు మండలాలకు చెందిన సుమారు 300 మంది రైతులకు అందించారు. ఈ కార్యక్రమంలో మంథని ఎడిఎ అంజని మిశ్రా, డివిజన్ లోని  మంథని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్ మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.