మహిళలు స్వశక్తితో ఉపాధి అవకాశాలు అందుకొని ఆర్థికంగా ఎదగాలని అమ్మ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు అంకరి కుమార్ అన్నారు. బుధవారం మంథని పట్టణంలోని సీయోను ప్రార్ధన మందిరంలో ఉషా ఇంటర్నేషనల్ కంపెని, సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత కుట్టు శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.