ప్రభుత్వ విద్యా సంస్థలను ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని బాలికల పాఠశాల ప్రధానోపాధ్యయురాలు సుమలత అన్నారు. శుక్రవారం అదే పాఠశాలలో పని చేస్తున్న దొంతుల కుమార్ అనే ఉపాధ్యాయుడు వాళ్ళ కుమార్తె మనస్విని 8 వ తరగతిలో చేర్పించారు. ఈ సందర్భంగా సుమలత మాట్లాడుతూ విద్యార్థులకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయన్నారు. ఉచిత విద్యతో పాటు మధ్యాహ్న భోజనం, పాఠ్య పుస్తకాలను అందిస్తామన్నారు.