సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మంథని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో శుక్రవారం విద్యార్థినీలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. శనివారం నుండి కళాశాలకు సంక్రాంతి పండుగ సెలవులు ఉండటంతో ముందస్తుగా ముగ్గుల పోటీలు చేపట్టారు. కళాశాల ఆవరణలో పలు రంగులతో వేసిన రంగవల్లులు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పోటీలో గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్ధినులు పాల్గొన్నారు.