వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా జిల్లాలో ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం పెద్దపల్లి కలెక్టరేట్ లో తాగునీటి సరఫరాపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో మిషన్ భగీరథ గ్రిడ్, ఇంట్రా తాగునీటి సరఫరాలో భాగంగా చేపట్టిన పనులు, ప్రస్తుతం నీటి సరఫరా జరుగుతున్న ఆవాసాలు, వాటర్ సోర్స్, ఇబ్బందులపై తెలుసుకున్నారు. ఇంట్రా ఈఈ శ్రీనివాస్, గ్రిడ్ ఈఈ పూర్ణచందర్ పాల్గొన్నారు.