భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు, ఓదెల మండలం కొలనూర్ గ్రామానికి చెందిన కర్రె సంజీవరెడ్డిని నియమిస్తూ పార్టీ అధిష్టానం సోమవారం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పార్టీ సంస్థాగత జిల్లా ఎన్నికల అధికారి అయ్యన్నగారి భూమన్న నియామక ఉత్తర్వులు సంజీవరెడ్డికి అందజేశారు. సంజీవరెడ్డి ఎంపిక పట్ల బీజేపీ జిల్లా, ఓదెల మండల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.