యాసంగి సీజన్ లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగుతోందని అదనపు కలెక్టర్ వేణు అన్నారు.
శుక్రవారం పెద్దపల్లి కలెక్టరేట్ లో ధాన్యం కొనుగోలుపై మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టిందన్నారు. గతంకంటే అధికంగా ఈ యాసంగి సీజన్ లో ధాన్యం కొనుగోలు చేశామన్నారు. నాణ్యమైన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులకు 48 గంటల్లో చెల్లింపులు పూర్తి చేస్తున్నామన్నారు.