శ్రీధర్ బాబు పెట్టుబడులు తీసుకొచ్చి మంథని ప్రతిష్టను పెంచారు: సీఎం

61చూసినవారు
శ్రీధర్ బాబు పెట్టుబడులు తీసుకొచ్చి మంథని ప్రతిష్టను పెంచారు: సీఎం
మంథని నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉందని సీఎం రేవంత్ అన్నారు. కాళేశ్వరం దేవలయ ప్రాంగణంలో తొలిరోజు సరస్వతి పుష్కర స్నానం ఆచరించి మాట్లాడారు. 'మన దేశ ఆర్ధిక వ్యవస్థను ప్రపంచంలోనే 4వ స్థానానికి తీసుకెళ్లడంలో పీవీ నరసింహారావు ఎనలేని కృషి చేశారు. ఆ తరువాత దుద్దిళ్ల శ్రీపాదరావు మంథని పేరు నిలబెట్టారు. ఇప్పుడు మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి మంథని ప్రతిష్టను మరింత పెంచారు' అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్